- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బంతితో మెరిసిన ఆంధ్ర బౌలర్లు శశికాంత్, నితీశ్
దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో శుక్రవారం ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్లు శశికాంత్, నితీశ్ మెరిశారు. ఈ పేస్ ద్వయం ధాటికి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో మోస్తరు స్కోరుకే పరిమితమయ్యే స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లను కోల్పోయి 234 పరుగులు చేసింది. మొదట ఓపెనర్లు యశ్ దూబె, హిమాన్షు శుభారంభం అందించారు. యశ్ దూబె(64) హాఫ్ సెంచరీతో రాణించగా.. హిమాన్షు(49) పర్వాలేదనిపించాడు. దీంతో ఈ జోడీ తొలి వికెట్‌కు 123 పరుగులు జోడించింది. అయితే, శశికాంత్, నితేశ్ బంతితో చెలరేగడంతో మధ్యప్రదేశ్ వేగంగా పతనమైంది. 36 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి 159/7 స్కోరుతో నిలిచింది. ఈ పరిస్థితుల్లో శరన్ష్ జైన(41 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యతను మీదేసుకున్నాడు. కుమార్ కార్తీకేయ(29)తో కలిసి 51 పరుగులు జోడించాడు. తొలి రోజు ముగిసే సమయానికి శరన్ష్ జైన్‌తోపాటు కుల్వంత్ ఖెజ్రోలియా( బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శనివారం తొలి సెషన్‌లోనే ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించొచ్చు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ 4 వికెట్లు, నితీశ్ రెడ్డి 3 వికెట్లతో సత్తాచాటగా.. గిరినాథ్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టాడు.