- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ ఆల్‌రౌండ్ షో.. సిక్కింకు చుక్కలు చూపించారుగా..
దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ప్లేట్ గ్రూపులో సంచలన ప్రదర్శనతో సత్తాచాటుతున్న హైదరాబాద్..శుక్రవారం సిక్కింతో ప్రారంభమైన మూడో గ్రూపు మ్యాచ్‌లో తొలి రోజే మ్యాచ్‌పై పట్టు సాధించింది. మొదటి రోజు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 302 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సిక్కిం తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులే చేసి ఆలౌటైంది. అంకుర్ మాలిక్ చేసిన 17 పరుగులే టాప్ స్కోర్ అంటే ఆ జట్టును హైదరాబాద్ బౌలర్లు ఏ విధంగా బెంబేలెత్తించారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్, మిలింద్ ధాటికి సిక్కిం కుప్పకూలింది. త్యాగరాజన్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 6 వికెట్లతో చెలరేగాడు. మిలింద్4 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్(137, 125 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదం తొక్కాడు. మరో ఓపెనర్ రాహుల్ సింగ్(83), రోహిత్ రాయుడు(75), కెప్టెన్ తిలక్ వర్మ(70 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. చందన్ సహాని(8 బ్యాటింగ్)తో కలిసి తిలక్ తొలి రోజు ఆటను ముగించాడు. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది.
ఆంధ్ర 188 ఆలౌట్ : ఎలైట్-బి గ్రూపులో అసోంతో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి రోజే కుప్పకూలింది. టాస్ గెలిచి ముందుగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర 188 పరుగులు చేసి ఆలౌటైంది. షోయబ్ ఖాన్(63) హాఫ్ సెంచరీకితోడు నితీశ్ రెడ్డి(49) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఆంధ్ర ఆ స్కోరైనా చేయగలిగింది. కెప్టెన్ రిక్కీ భుయ్(24), హనుమ విహారి(4)తోపాటు మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అసోం బౌలర్ రాహుల్ సింగ్(6/46) ఆరు వికెట్ల ప్రదర్శనతో ఆంధ్ర జట్టు పతనాన్ని శాసించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన అసోం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ఓపెనర్లు రిషవ్ దాస్(18 బ్యాటింగ్), రాహుల్ హజరింక(21 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంకా ఆ జట్టు 145 పరుగులు వెనుకబడి ఉన్నది.