ఆఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌ అరుదైన ఘనత.. సచిన్‌ రికార్డు బద్దలు

by Vinod kumar |
ఆఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌ అరుదైన ఘనత.. సచిన్‌ రికార్డు బద్దలు
X

దిశ, వెబ్‌డెస్క్: హంబన్‌టోటా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో ఆఫ్గానిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ సెంచరీ చేయడంతో అరుదైన ఘనత సాధించాడు. 21 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్బాజ్‌ రికార్డులకెక్కాడు. గుర్బాజ్‌ 5 సెంచరీలు సాధించాడు. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ రికార్డును గుర్బాజ్ బ్రేక్‌ చేశాడు. సచిన్‌ తన 21 ఏళ్ల వయస్సులో 4 వన్డే సెంచరీలు సాధించాడు.

తాజా మ్యాచ్‌తో సచిన్‌ను ఈ ఆఫ్గాన్‌ ఓపెనర్‌ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెపర్‌ ‍క్వింటన్‌ డికాక్‌, శ్రీలంక మాజీ ఓపెనర్‌ ఉపుల్‌ తరంగా చెరో 6 సెంచరీలతో అగ్రస్ధానంలో సంయుక్తంగా కొనసాగుతున్నాడు. అదే విధంగా మరో అరుదైన ఘనతను కూడా గుర్భాజ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 5 సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా గుర్భాజ్‌ రికార్డులకెక్కాడు. గుర్బాజ్‌ కేవలం 23 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed