CPL 2023: విండీస్​'బాహుబలి' 12 సిక్స్‌లతో విధ్వంసం.. వీడియో వైరల్

by Vinod kumar |
CPL 2023: విండీస్​బాహుబలి 12 సిక్స్‌లతో విధ్వంసం.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కరేబియన్ ప్రీమియర్ లీగ్​ 2023లో 12 సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు వెస్టిండీస్ ప్లేయర్ రఖీమ్​కార్న్​వాల్. సెంయిట్​కిట్స్​ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్​ రాయల్స్​ ఆల్​రౌండర్ రఖీమ్.. 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ శతకంతో సీపీఎల్‌లో ఇప్పటివరకు అత్యంత వేకంగా సెంచరీ బాదిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే టీ20ల్లో రఖీమ్‌కు ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సోమవారం బార్బడోస్ రాయల్స్, సెయింట్ కిట్స్​అండ్ నెవిస్ పాట్రియాట్స్​జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సెయింట్ కిట్స్​విధించిన 221 పరుగుల లక్ష్యాన్ని.. 18.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది రాయల్స్. ఇందులో ఓపెనర్ రఖీమ్​విధ్వంసకర ప్రదర్శనతో 48 బంతుల్లో నాలుగు ఫోర్లు, 12 సిక్సర్లో 102 పరుగులు చేశాడు.

రకీంను ఎలా అడ్డుకోవాలో కూడా పాట్రియాట్స్ బౌలర్లకు అర్థం కాలేదు. ఎలాంటి బంతి వేసినా కూడా దాన్ని బౌండరీకి తరలించాడీ భారీ కాయుడు. కేవలం 45 బంతుల్లో సెంచరీ చేసిన అనంతరం.. బ్యాట్ డ్రాప్‌తో కొత్తగా తన శతకాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అతన్ని తెగ మెచ్చుకుంటున్నారు. రకీం ఒక బ్యాటింగ్ బీస్ట్ అంటూ కితాబిస్తున్నారు.

ఈ బాహుబలి ఇన్నింగ్స్ తర్వాత రిటైర్డ్ అవుట్‌గా అతను మైదానం వీడాడు. దీంతో పాట్రియాట్స్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన లారీ ఇవాన్స్ (24) కూడా వేగంగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ (26 బంతుల్లో 49 నాటౌట్) చెలరేగాడు. బార్బడోస్ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసుకోవడంతోపాటు సెంచరీతో చెలరేగిన రకీంకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Advertisement

Next Story