డబ్ల్యూటీసీ ఫైనల్ వేళ షాకింగ్ పరిణామం.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లకు చెరో 3 పాయింట్లు కట్

by Sathputhe Rajesh |
డబ్ల్యూటీసీ ఫైనల్ వేళ షాకింగ్ పరిణామం.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లకు చెరో 3 పాయింట్లు కట్
X

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ రేస్‌లో పోటీ తీవ్రతరం అవుతున్న వేళ న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లకు ఊహించని షాక్ తగిలింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ రెండు జట్లకు చెరో మూడు పాయింట్లను ఐసీసీ కోత విధించింది. క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు జట్లు ఓవర్ రేట్‌ను కొనసాగించడంలో విఫలం అయ్యాయని ఐసీసీ పేర్కొంది. రెండు జట్లకు తమ మ్యాచ్ ఫీజులో 15 శాతాన్ని కోతగా విధించినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. నిర్ణీత సమయానికి మూడు ఓవర్లు వెనకబడ్డ రెండు జట్లకు ఒక్కో ఓవర్‌కు ఒక పాయింట్ చొప్పున మొత్తం మూడు పాయింట్లను కట్ చేసింది. తొలి టెస్ట్‌లో గెలిచిన ఇంగ్లాండ్ ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉన్న న్యూజిలాండ్ అవకాశాల మీద తాజా పరిణామం భారీ ఎఫెక్ట్ చూపనుంది. మూడు పాయింట్లను ఐసీసీ కోత విధించడంతో టేబుల్‌లో న్యూజిలాండ్ నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. పెనాల్టీ కారణంగా ప్రస్తుతం న్యూజిలాండ్ 47.92 పాయింట్లతో కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌తో మిగిలిన రెండు టెస్టులను న్యూజిలాండ్ గెలిస్తే.. 55.36 పాయింట్లు సాధిస్తుంది. అయిన ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ భవితవ్యం ఇతర జట్లు ఆడే మ్యాచ్‌లపైనే ఆధారపడి ఉంటుంది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story