మలేషియాలో భారత్‌కు 5 గోల్డ్ మేడల్స్ సాధించిన ఆర్. మాధవన్ కుమారుడు

by Mahesh |   ( Updated:2023-04-18 06:55:35.0  )
మలేషియాలో భారత్‌కు 5 గోల్డ్ మేడల్స్ సాధించిన ఆర్. మాధవన్ కుమారుడు
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ రికార్డు సృష్టించాడు. మలేషియా ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ఐదు బంగారు పతకాలు సాధించాడు. 17 ఏళ్ల వేదాంత్ భారత్ వేదికగా జరిగిన అన్ని స్విమ్మింగ్ పోటీల్లో కూడా చాంపియన్‌గా నిలిచాడు. కాగా మలేషియాలో వేదాంత్ సాధించిన గోల్డ్ మెడల్స్ ఫొటోలను మాధవన్ ట్వీట్ చేస్తూ.. "దేవుని దయ, మీ అందరి శుభాకాంక్షలతో, వేదాంత్ రెండు వ్యక్తిగత బెస్ట్‌లతో భారతదేశానికి (50, 100, 200, 400, 1500 మీటర్లు) 5 స్వర్ణాలను సాధించాడు. ఈ విజయాలతో అతను ఎంతో ఉల్లాసంగా ఉన్నాడని.. రాసుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed