- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
PV Sindhu BWF Rank: పీవీ సింధు డీలా.. పదేళ్లలో లోయస్ట్ ర్యాంక్
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు తీవ్ర నిరాశ ఎదురైంది. పీవీ సింధు ర్యాంకింగ్స్‌లో డీలా పడిపోయింది. గత మూడేళ్లుగా వరుస పరాజయాలతో వైఫల్యాల ఊబిలో కూరుకుపోయింది. సీజన్.. సీజన్‌కూ ర్యాంకింగ్స్‌లో దిగజారిపోతూ వస్తోంది. తాజాగా విడుదలైన బీడబ్ల్యూఎఫ్ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు ర్యాంక్పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఐదు స్థానాలు దిగజారి ప్రపంచ 17వ ర్యాంక్‌కు చేరింది. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సింధు.. ఆ తర్వాత గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరమైంది. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చినా సత్తా చాటలేకపోతోంది. వరుస టోర్నీల్లో ప్రారంభ రౌండ్లలోనే ఓటమిపాలైంది. దాంతో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టాప్-10 ర్యాంకింగ్స్‌లో సింధు చోటు కోల్పోయింది.
Advertisement
Next Story