- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
PV Sindhu: అద్భుతమైన ప్లేయర్లను తయారు చేస్తా.. పీవీ సింధు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ సహకారంతో బ్యాడ్మింటన్ (Badminton)పై మక్కువ ఉన్న యువతీ, యువకులను అద్భుతమైన ప్లేయర్లుగా తీర్చిదిద్దుతామని ఒలింపిక్ మెడల్ విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) అన్నారు. ఇవాళ విశాఖపట్నం (Vishakhapatnam)లోని ఆరిలోవ (Arilova)లో ప్రభుత్వం బ్యాడ్మింటన్ అకాడమీ (Badminton Academy)కి కేటాయించిన మూడెకరాల స్థలంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా పీవీ సింధు (PV Sindhu) మాట్లాడుతూ.. తాను తరచుగా విశాఖపట్నం (Vishakhapatnam) వస్తూనే ఉంటానని అన్నారు. ఏడాదిలోగా బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. విశాఖలో బ్యాడ్మింటన్ నేర్చుకునే క్రీడాకారుల పొటెన్షియాలిటీ చాలా ఎక్కువ ఉందని కితాబిచ్చారు. తనకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని అన్నారు. అకాడమీ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. మెరికల్లాంటి బ్యాడ్మింటన్ ప్లేయర్లను తయారు చేసిన అంతర్జాతీయ ఈవెంట్లలో పథకాలు సాధించేలా క్రీడాకారులను తయారు చేస్తామని పీవీ సింధు అన్నారు.