మలేసియా మాస్టర్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి శ్రీకాంత్, పీవీ సింధు..

by Vinod kumar |
మలేసియా మాస్టర్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి శ్రీకాంత్, పీవీ సింధు..
X

చెన్నై: మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు ప్రి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-12, 21-16 స్కోరుతో తోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) ను చిత్తు చేశాడు. మరోవైపు మహిళా సింగిల్స్‌లో కాస్త తడబడిన సింధు 21-13, 17-21, 21-18 స్కోరుతో లిన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) పై విజయం సాధించింది. అష్మిత చలిహా ప్రపంచ పదో ర్యాంకు క్రీడాకారిణి హాన్ యూ (చైనా) చేతిలో 21-17, 21-17 స్కోరుతో ఓడిపోయింది. ఆకర్షి కశ్యప్ ప్రపంచ నెంబర్ వన్ అకానే యమగుచి (చైనా) చేతిలో 21-17, 21-12 తేడాతో చిత్తయింది.

Advertisement

Next Story

Most Viewed