- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పీటీ ఉషకు ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు
దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ స్ప్రింటర్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) ప్రెసిడెంట్ పీటీ ఉషకు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆదివారం ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు ప్రదానం చేసింది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..‘నేను సాధించిన విజయాలను నేటికీ గుర్తుంచుకున్నందుకు కృతజ్ఞతలు. ప్రస్తుత క్రీడాకారులు పొందుతున్న సౌకర్యాలు, విదేశీ ట్రైనింగ్, పోషకాహారం, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ వంటివి నా కాలంలో లేవు. ప్రస్తుతం నేను ఐవోఏలో పనిచేస్తున్నాను. ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌పై మా ఫోకస్ ఉంది. ఆ తర్వాత 2036 నాటికి భారత్‌ను క్రీడా శక్తిగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌పై దృష్టి పెడతాం.’ అని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. పీటీ ఉష దేశంలో ఎందరికో స్ఫూర్తి అని అన్నారు. కాగా, పీటీ ఉష కంటే ముందు ఈ అవార్డును విజయ్ అమృతరాజ్ (టెన్నిస్), ప్రకాష్ పదుకొణె (బ్యాడ్మింటన్), సునీల్ గావస్కర్ (క్రికెట్), మాజీ స్ప్రింటర్ మిల్కా సింగ్ అందుకున్నారు. 1997-2000 మధ్యలో పీటీ ఉష భారత్ తరపున ఎన్నో ఘనతలు సాధించింది. ఆమె కెరీర్‌లో 103 అంతర్జాతీయ పతకాలు గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణ పతకాలు, 7 రజత పతకాలు సాధించింది. మూడు సార్లు ఒలింపిక్స్‌లోనూ పాల్గొంది.