పృథ్వీ షా రీఎంట్రీ.. ఆరు నెలల తర్వాత మైదానంలోకి యువ ఓపెనర్

by Harish |
పృథ్వీ షా రీఎంట్రీ.. ఆరు నెలల తర్వాత మైదానంలోకి యువ ఓపెనర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ ఓపెనర్ పృథ్వీ షా చాలా కాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. రంజీ ట్రోఫీతో అతను రీ ఎంట్రీ ఇస్తున్నాడు. గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే కప్ టోర్నీలో నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన షా డబుల్ సెంచరీ, సెంచరీతో సత్తాచాటాడు. అయితే, మోకాలి గాయం బారినపడి స్వదేశానికి తిరిగివచ్చాడు. ఆ తర్వాత లండన్‌లో సర్జరీ చేయించుకున్న అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో మూడునెలలపాటు పునరావసం పొందాడు. తాజాగా ఎన్‌సీఏ అతనికి ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించి క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో రంజీ ట్రోఫీలో ముంబై టీమ్.. అతన్ని జట్టులోకి తీసుకుంది. శుక్రవారం నుంచి బెంగాల్‌తో జరగబోయే మ్యాచ్ కోసం అతన్ని జట్టులో చేర్చింది. దాదాపు ఆరు నెలల తర్వాత షా కాంపిటేటివ్ క్రికెట్ ఆడబోతున్నాడు. కాగా, అద్భుతమైన టాలెంట్‌తో పృథ్వీ షా తక్కువ కాలంలోనే స్టార్‌గా ఎదిగాడు. అయితే, జాతీయ జట్టు తరపున అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరోవైపు, గాయాలు, వివాదాలు అతన్ని వెనక్కినెట్టాయి. టీమ్ ఇండియా తరపున 2021లో శ్రీలంకతో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. 5 టెస్టులు, 6 వన్డేల్లో అతను 528 పరుగులు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed