- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐపీఎల్‌లో ఆ జట్టు తరపున ఆడాలని ఉందంటే తిట్టాడు: స్టార్ బౌలర్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ స్టార్ పేసర్ ప్రవీణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా ప్రత్యర్థులకు తన బౌలింగ్‌తో చుక్కలు చూపిస్తుంటాడు. ముఖ్యంగా స్వింగ్ బౌలింగ్ వేయడంలో తనకు తానే సాటి అనే చెప్పారు. తాజాగా.. ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ తనను బెదిరించాడంటూ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఐపీఎల్ తొలి సీజన్‌లో ప్రవీణ్ కుమార్ ఆర్సీబీ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఆ సమయంలో తన స్వస్థలానికి దగ్గరి జట్టు అయిన ఢిల్లీ తరపున ఆడాలని కోరిక ఉండేదట. ఇదే విషయాన్ని ప్రవీణ్ కుమార్ లలిత్ మోడీకి చెప్పగా.. తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని సమాచారం. అంతేకాదు.. భారత ఆటగాళ్లంతా మద్యం తాగుతారని, కానీ తనను మాత్రమే తాగుబోతులా చిత్రీకరించే వాళ్లను ప్రవీణ్ కుమార్ చేసిన మరో వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.