- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Paris Paralympics : హైజంప్‌లో ప్రవీణ్‌కు స్వర్ణం.. బంగారు పతకాల్లోనూ టోక్యో ప్రదర్శనను బద్దలు కొట్టిన భారత్
దిశ, స్పోర్ట్స్ : భారత పారా హైజంపర్ ప్రవీణ్ కుమార్ మళ్లీ అదరగొట్టాడు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం గెలిచిన అతను ఈ సారి పసిడి ముద్దాడాడు. పురుషుల హైజంప్ టీ64 ఈవెంట్‌లో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఫైనల్‌లో ప్రవీణ్ 2.08 మీటర్ల ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఆసియా రికార్డును నెలకొల్పాడు. అంతేకాకుండా, ఈ విశ్వక్రీడల్లో భారత్‌కు 6వ బంగారు పతకం అందించాడు. మొత్తంగా భారత్‌కు ఇది 26వ మెడల్. ఇప్పటికే టోక్యో ప్రదర్శన(19 పతకాలు)ను భారత్ అధిగమించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రవీణ్ స్వర్ణంతో టోక్యోలో సాధించిన ఐదు పసిడి పతకాల ప్రదర్శనను కూడా బద్దలుకొట్టింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ వరుస పారాలింపిక్స్‌ల్లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్ల జాబితాలో చేరడంతోపాటు హైజంప్‌లో మరియప్పన్ తంగవేలు తర్వాత స్వర్ణం సాధించిన రెండో భారత హైంజర్‌గా నిలిచాడు.