Sankranthiki Vasthunnam : "సంక్రాంతికి వస్తున్నాం"కు ఏపీ గుడ్ న్యూస్

by M.Rajitha |
Sankranthiki Vasthunnam : సంక్రాంతికి వస్తున్నాంకు ఏపీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : "సంక్రాంతికి వస్తున్నాం"(Sankranthiki Vasthunnam) చిత్ర బృందానికి ఏపీ ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది. సినిమా టికెట్ ధరలు(Ticket Prices) పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదల రోజూ నుంచి మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్స్ లో రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.125 పెంచింది. దీంతో సినిమా టికెట్ ధరలు రూ.245, రూ.175, రూ.302 ఉండనున్నాయి. దిల్ రాజు(Dil Raju) నిర్మాతగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో.. వెంకటేశ్(Venkatesh), ఐశ్వర్య రాజేష్(Ishwarya Rajesh), మీనాక్షీ చౌదరీ(Meenakshi Chowdary) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం ఈనెల 12న విడుదల కానుంది.

Advertisement

Next Story