- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అటు చంద్రబాబు. ఇటు పవన్.. తిరుపతి బాధితులకు పరామర్శ
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి(Srivari Vaikunta Dwara Darshan ) భక్తులు(Devottees) తిరుపతికి భారీగా తరలివచ్చారు. గురువారం తెల్లవారుజామున జారీ చేసే టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.. అయితే ఒక్కసారిగా భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ మేరకు వారికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఇప్పటికే బాధితులను పరామర్శించారు. అటు పవన్ కల్యాణ్ సైతం తిరుపతి చేరుకున్నారు. తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
ఇక మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారికి కూడా భరోసా కల్పించింది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చింది.