Tirumala: టీటీడీ పరిపాలన భవన్‌కు సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |
Tirumala: టీటీడీ పరిపాలన భవన్‌కు సీఎం చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో వైకుంఠ దర్శనానికి జారీ చేసే టోకెన్ల కోసం బుధవారం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఇప్పటికే బాధితులను పరామర్శించారు. అటు పవన్ కల్యాణ్ సైతం తిరుపతి చేరుకున్నారు. తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో టీటీడీ పరిపాలన భవన్‌కు సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. సీఎంఓ అధికారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు.. తొక్కిసలాట కారణాలపై నివేదిక అందించాలని అధికారులను కోరారు.

Advertisement

Next Story