- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రషీద్ ఖాన్ పై విరుచుకుపడ్డ పోలార్డ్.. ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు
దిశ, వెబ్ డెస్క్: టీ20 క్రికెట్ చరిత్రలో సిక్సర్ల పేరు చెబితే గుర్తుకొచ్చేది యువరాజ్ సింగ్. ఇంగ్లాండ్ జట్టుపై అప్పట్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డు నేటికి మొదటి స్థానంలోనే ఉంది. కాగా ఇటీవల కాలంలో కొంతమంది ఒకే ఓవర్లు ఆరు సిక్సర్లు కొట్టినప్పటికీ అవి కీలక మ్యాచులు కాకపోవడం, నో బాల్స్ ఉండటం వంటి కారణాల వల్ల పరిగణనలోకి తీసుకోలేదు. అయితే తాజాగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరణ్ పోలార్డ్ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఊచకోత కోశాడు. ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి విధ్వంసం సృష్టించాడు. హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్-2024 లో భాగంగా పోలార్డ్ ఈ ఫీట్ సాధించాడు. శనివారం రాత్రి ట్రెంట్ రాకెట్స్, సౌతర్న్ బ్రేవ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో పోలార్డ్ వరుసగా ఐదు సిక్సర్లు బాది తమ జట్టును గెలిపించాడు. కాగా ఈ మ్యాచ్ లో పోలార్డ్ కొట్టిన భారీ సిక్సర్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.