- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశం కీర్తి పెంచారు : - ‘మన్ కీ బాత్’లో భారత అథ్లెట్లపై ప్రధాని మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ : ఈ ఏడాది క్రీడా రంగంలో భారత అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో ప్రధాని క్రీడా రంగం గురించి మాట్లాడుతూ.. భారత క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. ఆసియా క్రీడలతోపాటు వివిధ టోర్నీలో భారత అథ్లెట్లు సత్తాచాటారని కొనియాడారు. ‘ఈ సంవత్సరం మన అథ్లెట్లు గొప్ప ప్రదర్శన చేశారు. ఆసియా గేమ్స్‌లో 107 పతకాలు గెలుచుకున్నారు. ఆసియన్ పారా గేమ్స్‌లో 111 మెడల్స్ సాధించారు. వన్డే వరల్డ్ కప్‌లో భారత క్రికెటర్ల ప్రదర్శన అందరి హృదయాలను గెలుచుకుంది. మహిళల జట్టు అండర్-19 టీ20 ప్రపంచకప్విజేతగా నిలవడం స్ఫూర్తిదాయకం. ఇతర క్రీడల్లోనూ మన ఆటగాళ్లు సాధించిన విజయాలు దేశం కీర్తిని పెంచాయి.’అని చెప్పారు. వచ్చే ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌లోనూ సత్తాచాటాలని ఆకాంక్షించారు. దేశం మొత్తం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.