Paris Olympics: మను భాకర్ కోచ్‌కు ఢిల్లీ ప్రభుత్వం బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే?

by Maddikunta Saikiran |
Paris Olympics: మను భాకర్ కోచ్‌కు ఢిల్లీ ప్రభుత్వం బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రీడలలో భారత స్టార్ మహిళా షూటర్ మను భాకర్, షూటింగులో రెండు కాంస్య పతకాలు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోతోంది. కాగా ఆమె కోచ్‌కు మాత్రం ఊహించని సంఘటన ఎదురయింది.మను భాకర్ కోచ్,అర్జున అవార్డు గ్రహీత ,సమరేష్ జంగ్‌కు చెందిన నివాసంను కూల్చివేస్తాం అని ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలో అతను పారిస్ నుండి హుటా హుటీన ఇండియాకు తిరిగి ప్రయాణమయ్యారు.

అతడు నివాసం ఉంటున్న ఇళ్లు ఢిల్లీలోని సివిల్ లైన్స్ అనే ప్రాంతంలో ఉంది . అక్కడ ఉన్న ఇళ్లు, ఇతర భవనాలు అక్రమంగా నిర్మించాబడ్డాయని హౌసింగ్ మంత్రిత్వ శాఖ యొక్క అనుబంధ సంస్థ అయిన ల్యాండ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీస్ (LNDO) తెలిపింది. దీంతో ఆ ప్రాంత నివాస వాసులందరికి LNDO నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా సమరేష్ మీడియాతో మాట్లాడుతూ.. "ఈ విషయం గురించి నాకు పూర్తిగా తెలియదని, కూల్చివేతల గురించి గత రాత్రి సమాచారం అందించారని.. ఖాళీ చేయడానికి కేవలం రెండు రోజుల సమయం ఇచ్చారు అని వ్యాఖ్యానించారు. అలాగే దేశం కోసం పతకాలు సాధించేలా చేస్తే ..తనకు ఇలా నోటీసులు జారీ చేయడం దారుణమని" ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. సమరేష్ 2006 మెల్బోర్న్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరుపున 5 స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలను సాధించాడు.

Advertisement

Next Story

Most Viewed