Paris Olympics : ఒలింపిక్స్ విలేజ్‌లో విషాదం.. ఆ దేశ బాక్సింగ్ కోచ్ మృతి

by Harish |
Paris Olympics : ఒలింపిక్స్ విలేజ్‌లో విషాదం.. ఆ దేశ బాక్సింగ్ కోచ్ మృతి
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌ విలేజ్‌లో విషాదం చోటుచేసుకుంది. సమోవా బాక్సింగ్ కోచ్ లియోనల్ ఎలికా ఫటుఫైటో గుండెపోటుతో మృతి చెందారు. ఫటుఫైటో మృతిని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) శనివారం ధ్రువీకరించింది. 60 ఏళ్ల ఫటుఫైటో శుక్రవారమే మరణించినట్టు తెలుస్తోంది. అతనికి అత్యవసర సేవలు అందించినప్పటికీ, పరిస్థితి విషమించి మృతి చెందినట్టు స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. అలాగే, ఫటుఫైటోది సహజ మరణమని పేర్కొంది. ఫటుఫైటో మృతి పట్ల ఐబీఏ సంతాపం వ్యక్తం చేసింది. ఫటుఫైటో వారసత్వం భవిష్యత్ తరాల బాక్సర్లకు స్ఫూర్తినిస్తుందని తెలిపింది. కాగా, బాక్సింగ్‌లో సమోవా నుంచి ఏకైక బాక్సర్ అటో ప్లోడ్జికి-ఫావో గాలీ హెవీ వెయిట్ కేటగిరీలో బరిలో ఉన్నాడు.

Advertisement

Next Story