వెయిట్‌లిఫ్టింగ్ వరల్డ్ కప్ బరిలో మీరాబాయి చాను

by Harish |
వెయిట్‌లిఫ్టింగ్ వరల్డ్ కప్ బరిలో మీరాబాయి చాను
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను గతేడాది ఆసియా క్రీడల్లో తుంటి గాయం బారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు నెలల తర్వాత ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది. ఆమె థాయిలాండ్‌లో ఆదివారం ప్రారంభమైన ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ వరల్డ్ కప్‌ బరిలో నిలిచింది. సోమవారం మహిళల 49 కేజీల కేటగిరీలో మీరాబాయి చాను పోటీపడనుంది. ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా ఆమె ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోనుంది. ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్‌లో మీరాబాయి తన విభాగంలో 2వ ర్యాంక్‌లో ఉండటం బెర్త్‌కు ఢోకా లేదు. అయితే, ఒలింపిక్స్‌కు ఈ టోర్నీనే చివరి క్వాలిఫయింగ్ ఈవెంట్. అలాగే, ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే ఈ టోర్నీలో పాల్గొనడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం.. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో నిలిచిన వారు తమ విభాగాల్లో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.

Advertisement

Next Story

Most Viewed