పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఫ్లాగ్‌బేరర్‌గా శరత్ కమల్

by Harish |
పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఫ్లాగ్‌బేరర్‌గా శరత్ కమల్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌ ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందాన్ని స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ నడపించనున్నాడు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) గురువారం శరత్‌ను ఫ్లాగ్ బేరర్‌గా ఎంపిక చేసింది. అలాగే, దిగ్గజ బాక్సర్, 2012 ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ మేరీకోమ్‌‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను ‘చెఫ్ డి మిషన్’గా నియమించింది. ఒలంపియన్ శివ కేశవన్ డిప్యూటీ చెఫ్ డి మెషన్‌గా.. 2012 ఒలింపిక్స్ మెడలిస్ట్ గగన్ నారంగ్ షూటింగ్ విలేజ్ ఆపరేషన్స్ ఇన్‌చార్జిగా ఎంపిక చేసింది. ‘ఈ నియామకాలు అనుభవం, నైపుణ్యం, నాయకత్వాన్ని సూచిస్తాయి. అంతర్జాతీయ వేదికపై భారత అథ్లెట్ల విజయానికి దోహదం చేస్తాయి.’ ఐవోఏ’ తెలిపింది.


Advertisement

Next Story