Champions Trophy : దాయాదుల పోరుపై పాక్ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Harish |
Champions Trophy : దాయాదుల పోరుపై పాక్ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ పోరు అంటే ఎంత క్రేజ్ ఉందో.. ఇరు జట్లలో అంతే టెన్షన్ కూడా ఉంటుంది. ఓడితే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే, భావోద్వేగాలతో కూడుకున్న ఈ దాయాదుల పోరులో గెలుపు కోసం ఇరు జట్లు చివరి వరకూ పోరాడుతాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 23న దుబాయ్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. దాయాదుల పోరుపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరిఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

టోర్నీలో తమకు భారత్‌తో మ్యాచే అసలైన టాస్క్ అని చెప్పారు. ‘మాకు మంచి జట్టు ఉంది. ఇటీవల బాగా రాణించింది కూడా. కానీ, చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాతో మ్యాచ్ మాకు అసలైన టాస్క్. టైటిల్ గెలవడమే కాకుండా భారత జట్టును ఓడించడమే లక్ష్యం. దేశం మొత్తం పాక్‌ జట్టుకు మద్దతుగా ఉంటుంది.’ అని వ్యాఖ్యానించారు. చివరిసారిగా 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాక్ టైటిల్ కైవసం చేసుకుంది. ఆ టోర్నీ తర్వాత వన్డేల్లో టీమిండియాపై పాక్ మ్యాచ్‌లో గెలవలేదు. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. మరో మ్యాచ్ రద్ద్దైంది.


Next Story

Most Viewed