చేజేతులారా ప్రపంచ నంబర్ వన్ వన్డే ర్యాంక్ కోల్పోయిన పాకిస్థాన్

by Mahesh |
చేజేతులారా ప్రపంచ నంబర్ వన్ వన్డే ర్యాంక్ కోల్పోయిన పాకిస్థాన్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రపంచ నంబర్ వన్ వన్డే ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ నెంబర్ వన్ ర్యాంకింగ్‌ను పాక్ 48 కూడా కాపాడుకోలేక పోయింది. చేజేతులారా ప్రపంచ నెంబర్ వన్డే ర్యాంకింగ్‌ను పోగొట్టుకుంది. కరాచిలో న్యూజిలాండ్ తో జరిగిన ఐదో వన్డేలో 47 పరుగుల తేడాతో పాక్ ఓటమి చెందింది. దీంతో పాక్ వన్డే ర్యాంకిగ్స్‌లో నెంబర్ వన్ స్థానం చేజార్చుకుంది. అలాగే ఒక్క ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది. కాగా ప్రస్తుతం వన్డే నెంబర్ వన్ జట్టుగా ఆస్ట్రేలియా ఉండగా.. రెండో స్థానంలో భారత్ ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed