ఆఫ్ఘనిస్తాన్‌పై ఓటమికి కారణమేంటో చెప్పిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్

by Javid Pasha |   ( Updated:2023-10-24 05:40:47.0  )
ఆఫ్ఘనిస్తాన్‌పై ఓటమికి కారణమేంటో చెప్పిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బలమైన జట్లు కూలిపోతుండగా.. పసికూనలు అనూహ్య రీతిలో విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. దీంతో ఈ వరల్డ్ కప్‌లో ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయనేది క్రికెట్ ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోమవారం పాకిస్తాన్ జట్టును ఆఘ్ఘనిస్తాన్ జట్టు మట్టి కరిపించింది. పాక్‌పై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్పందించాడు. తాము అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శన కనబరిచామని, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటామని తెలిపాడు. ముఖ్యంగా స్పిన్నర్లు రాణించలేకపోయారని, మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టలేకపోయారని అన్నాడు. ఆఘ్ఘనిస్తాన్ ప్లేయర్లు అద్బుతంగా ఆడారని, కీలక సమయంలో తాము ఓటమి చెందటం బాధగా ఉందని బాబర్ స్పష్టం చేశాడు. తాము మంచి టార్గెట్ ఇచ్చినా బౌలర్ల ప్రదర్శన వల్ల ఓడిపోయామని బాబర్ పేర్కొన్నాడు.

కాగా ఈ వరల్డ్ కప్‌లో పాక్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా.. కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రం గెలుపొందింది. దీంతో సెమీస్‌కు చేరే అవకాశాలు కూడా పాక్ జట్టుకు సన్నగిల్లాయి. ఆఘ్ఘనిస్తాన్ జట్టుపై ఓటమి చెందటంతో పాక్‌పై ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఆఘ్ఘనిస్తాన్ లాంటి జట్టుపై ఓటమిన పాక్ టీమ్ జీర్ణించుకోలేకపోతుంది.

Advertisement

Next Story

Most Viewed