పాకిస్తాన్‌ అరుదైన రికార్డ్.. వన్డే హిస్టరీలో..

by Vinod kumar |
పాకిస్తాన్‌ అరుదైన రికార్డ్.. వన్డే హిస్టరీలో..
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ఇంటర్నేషనల్స్ హిస్టరీలో పాకిస్తాన్‌ అరుదైన రికార్డ్ సృష్టించింది. న్యూజిలాండ్ జట్టు- పాకిస్తాన్‌లో పర్యటినలో వన్డే ఇంటర్నేషనల్స్ ఆడుతోంది. న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో విజయం సాధించడంతో.. వన్డే ఇంటర్నేషనల్స్ హిస్టరీలో 500వ విజయం అందుకున్న జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. ఈ రికార్డ్ ఆస్ట్రేలియా, భారత్ పేరు మీదే ఉంది. తాజాగా ఈ రెండు దేశాల సరసన చేరింది పాకిస్తాన్.

ఇప్పటివరకు రెండు జట్లు మాత్రమే ఈ క్లబ్‌లో ఉన్నాయి. ఆస్ట్రేలియా, భారత్.. ఇప్పటికే 500 విజయాలను అందుకున్నాయి. ఆస్ట్రేలియా- 594, భారత్-539 వన్డే మ్యాచ్‌లల్లో గెలిచాయి. ఈ తొలి మ్యాచ్ గురువారం రాత్రి రావల్పిండిలో ముగిసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 288 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

Advertisement

Next Story