- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పదేళ్లుగా రోజుకు ఒక్కసారే భోజనం.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 9 కేజీలు తగ్గిన షమీ

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mahamd Shami) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో (ICC Champions Trophy 2025) చెలరేగిపోతున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన భారత్-బంగ్లా మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాదు, మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ట్రోర్నీకి దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ దళానికి షమీ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా గాయాల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న షమీ ఛాంపియన్స్ ట్రోఫికి ముందు ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా కష్టపడినట్లు షమీ తెలిపాడు.
షమీ.. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ గాయాల పాలవ్వటంతో దాదాపు ఏడాదికి పైగా ఆటకు దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడి ఫిట్‌నెట్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన షమీ.. ఆ మ్యాచ్ తరువాత టీమిండియా మాజీ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సింధుతో తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.
కాలికి శస్త్ర చికిత్స అనంతరం షమీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరినట్లు తెలిపాడు. అకాడమీకి వెళ్లినప్పుడు దాదాపు 90 కేజీల వరకు ఉన్నానని, చాలా కాలం పాటు ఫిట్‌నెస్ కోసం శ్రమించినట్లు చెప్పాడు. అలాగే, గాయం నుంచి కోలుకుంటున్నప్పుడు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం సవాల్‌తో కూడుకున్నది తెలిపాడు. తానేప్పుడూ రుచి కోసం తినాలనుకోనని, అలాగే ఎక్కువగా స్వీట్లు తిననని చెప్పాడు. ఇక బిర్యానీ విషయంలోనే కొంత ఆందోళన ఉండేదని, అయితే, అప్పుడప్పుడు చేసే చీట్‌మీల్‌తో పెద్ద సమస్య ఉండేది కాదన్నాడు. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. షమీ 2015 నుంచి రోజుకు ఒక్క పూటే తింటున్నట్లు చెప్పాడు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేయనని, నేరుగా డిన్నర్ చేస్తానని తెలిపాడు. ఇది మొదట్లో కష్టంగా అనిపించినా.. అలవాటైతే ఈజీ అయిపోతుందని చెప్పాడు.