- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Olympics: 4 సెకన్ల ఆలస్యంతో కాంస్యం పాయే.. పతకం తిరిగిచ్చేయాలని కాస్ ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: అప్పీలుకు నాలుగు సెకన్ల ఆలస్యం కారణంగా ఒలంపిక్స్‌లో ఓ అమెరికా అథ్లెట్ పతకం కోల్పోతున్నది. గెలుచుకున్న కాంస్యాన్ని వెనక్కి ఇచ్చేయాలని అమెరికా జిమ్నాస్ట్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఆదేశించింది. పారిస్ ఒలంపిక్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో అమెరికా జిమ్నాస్ట్ జోర్డాన్ చిలెస్ ఆరో స్థానంలో నిలిచింది. దీనిపై జోర్డాన్ కోచ్ లు స్కోరును తప్పుగా నమోదు చేశారంటూ రివ్యూ కోరారు. అప్పీలును పరిశీలించిన జిమ్నాస్ట్ ఫెడరేషన్ స్కోర్ ను రివైజ్ చేసి జోర్డాన్ మూడో స్థానంలో నిలిచినట్లు ప్రకటించారు. దీంతో అమెరికా జిమ్నాస్ట్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అయితే దీనిపై రొమేనియాకు చెందిన అన్నా బార్బొస్ జోర్డాన్ కోచ్ లు రివ్యూ ఆడగడానికి నిమిషం కంటే 4 సెకన్లు సమయం ఆలస్యంగా తీసుకున్నారని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేసిన కాస్(CAS) జోర్డాన్ తన కాంస్యాన్ని తిరిగిచ్చేయాలని తీర్పునిచ్చింది. దీనిపై అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్.. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెబుతూ.. స్కోర్ ను మళ్లీ రివైజ్ చేసింది. దీంతో కాంస్య పతకాన్ని రొమేనియా జిమ్నాస్ట్ బార్బొస్ కు అందజేస్తామని ఒలంపిక్ సంఘం ప్రకటించింది.