- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే టెస్టులో విలియమ్సన్ రెండో శతకం
దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మరో శతకం బాదాడు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టాడు. మంగళవారం కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో అతను టెస్టుల్లో 31వ సెంచరీ నమోదు చేశాడు. 132 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌తో 109 పరుగులు చేశాడు. దీంతో ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన ఐదో కివీస్ ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. విలియమ్సన్ రాణించడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 528 పరుగుల ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 80/4తో ఆట కొనసాగించిన సౌతాఫ్రికా 162 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కీగన్ పీటర్సన్(45) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు తేలిపోయారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, సాంట్నర్ మూడేసి వికెట్లతో రాణించగా.. జేమీసన్, రచిన్ రవీంద్ర చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మూడో రోజే రెండో ఇన్నింగ్స్‌కు దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్లను కోల్పోయి 179 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్(109) సెంచరీ పూర్తి చేసి అవుటవ్వగా.. డారిల్ మిచెల్(11 బ్యాటింగ్), టామ్ బ్లండల్(5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.