- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పాకిస్థానే కాదు.. ఏ జట్టునైనా ఓడించే సత్తా మాకుంది! అమెరికా పేసర్
దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాదిలో జరిగిన టీ20 వరల్డ్ కప్-2024 లో.. అమెరికా క్రికెట్ జట్టు అద్భుత ఆట తీరును ప్రదర్శించిన సంగతి తెలిసిందే. టీం అమెరికా మొనాంక్ పటేల్ నేతృత్వంలో ప్రారంభ మ్యాచ్ లోనే కెనడాను ఓడించి.. టీ20 టోర్నీని విజయవంతంగా ప్రారంభించింది. తర్వాత బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్థాన్ ను కూడా మట్టికరిపించి రెండవ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో టీం అమెరికా సూపర్-8 కు దూసుకెళ్లింది. అయితే ఇప్పటికీ.. టీం అమెరికా ఆటగాళ్లు టీ 20 టోర్నీల్లో సాధించిన విజయాల నుంచి ఇంకా బయట పడ్డట్లు కనపడటం లేదు.
అయితే, తాజాగా ఆ జట్టు పేసర్ అలీఖాన్.. అగ్ర దేశాల జట్లను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.. అవేంటంటే.. "పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. కానీ మేము మాత్రం అలా లేము, అందుకే మాకు వారిని(పాక్ టీం) ఓడించగలమన్న ధైర్యం కలిగింది. ఆ మ్యాచ్ లో మాకు పరిపూర్ణమైన ఫిట్నెస్ సహా.. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ పాక్ ఆటగాళ్ల కంటే చాలా మెరుగైన ఆట తీరును కనబరిచాం. అలాగే మా జట్టు ఎప్పటికప్పుడు మెరుగుపడుతూనే ఉంది. చేతిలో పూర్తి స్థాయి జట్టు ఉంటే.. మాకు కలిసొచ్చిన రోజున మేం ఏ జట్టునైనా ఓడించగలం" అని చెప్పుకొచ్చాడు అమెరికా పేసర్ అలీఖాన్.