నార్వే చెస్ టైటిల్ కార్ల్‌సన్‌దే.. ప్రజ్ఞానందకు మూడో స్థానం

by Harish |
నార్వే చెస్ టైటిల్ కార్ల్‌సన్‌దే.. ప్రజ్ఞానందకు మూడో స్థానం
X

దిశ, స్పోర్ట్స్ : నార్వే చెస్ టోర్నీలో సంచలన ప్రదర్శన చేసిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మూడో స్థానంతో సరిపెట్టాడు. చివరిదైన 10వ రౌండ్‌లో అతను వరల్డ్ నం.3 హికారు నకమురా(అమెరికా)తో తలపడ్డాడు. మొదట క్లాసికల్ గేమ్‌ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఆర్మగెడాన్ గేమ్‌లో నకమురాను ప్రజ్ఞానంద ఓడించాడు. తెల్లపావులతో ఆడిన అతను 31 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. దీంతో ప్రజ్ఞానంద 14.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు, వరల్డ్ నం.1 కార్ల్‌సన్(నార్వే) 6వ సారి నార్వే చెస్ టైటిల్ ఎగరేసుకపోయాడు. 10వ రౌండ్‌లో ఫాబియానో కరువానా(అమెరికా)ను ఓడించిన అతను 17.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ప్రజ్ఞానంద సోదరి ఆర్.వైశాలి(12.5 పాయింట్లు), కోనేరు హంపి(10 పాయింట్లు) వరుసగా 4వ, 5వ స్థానాల్లో నిలిచారు. చైనా క్రీడాకారిణి జు వెన్జున్(19 పాయింట్లు) తొలిసారిగా టైటిల్ గెలుచుకుంది.

Advertisement

Next Story

Most Viewed