SL vs PAK 2nd Test: చెలరేగిన పాక్‌ బౌలర్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

by Vinod kumar |
SL vs PAK 2nd Test: చెలరేగిన పాక్‌ బౌలర్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 188 పరుగులకు కుప్పకూలింది. ఏంజెలో మాథ్యూస్‌ 63 పరుగులు నాటౌట్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దిముత్‌ కరుణరత్నే 41 రన్స్ చేశాడు. పాక్‌ బౌలర్లలో స్పిన్నర్‌ నొమన్‌ అలీ 7 వికెట్లతో చెలరేగగా.. చివర్లో నసీమ్‌ షా 3 వికెట్లు తీశాడు. సొంతగడ్డపై లంకకు ఇదే అతిపెద్ద పరాజయం కాగా.. పాకిస్తాన్‌కు లంక గడ్డపై అతిపెద్ద ఇన్నింగ్స్‌ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను పాకిస్తాన్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌ను 576 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (201) డబుల్‌ సెంచరీతో మెరవగా.. అగా సల్మాన్‌ (132 నాటౌట్‌) అజేయ సెంచరీతో మెరిశాడు. సాద్‌ షకీల్‌ 57, షాన్‌ మసూద్‌ 51, మహ్మద్‌ రిజ్వాన్‌ 50 పరుగులు చేశారు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌట్‌ అయింది.

Advertisement

Next Story