- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Team India ఓపెనర్‌పై Ex Wicket Keeper షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పదే పదే విఫలమవడం, ఇదే సమయంలో యువ ఆటగాళ్లు అదిరిపోయే ప్రదర్శన చేస్తుండటంతో జట్టుతో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధావన్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో గబ్బర్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ సబా కరీమ్ శిఖర్ ధావన్‌పై సంచలన కామెంట్స్ చేశాడు. వన్డేల్లో భారత్ 325-350 స్కోర్లు చేయాలంటే జట్టులో శిఖర్ ధావన్ ఉండకూడదని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
"శిఖర్ ధావన్ జట్టులో ఉండాలా లేదా అనేది టీమ్ మేనేజ్మెంట్‌పై ఆధారపడి ఉంది. 275 నుంచి 300 పరుగుల లక్ష్యం చాలనుకుంటే ధావన్‌ను ఆడించవచ్చు. అయితే 325 నుంచి 350 మధ్య స్కోరు కావాలంటే అతనికి చోటు ఉండదు. ఎందుకంటే అతను ఆ స్థాయిలోనే ఆడుతున్నాడని'' సబా కరీమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కొత్త ఆటగాళ్లు కావాలి.. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీషా లాంటి యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి" అని సబా కరీం స్పష్టం చేశారు.