- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
న్యూజిలాండ్‌కు షాక్.. టీ20 సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య న్యూజిలాండ్‌కు షాకిస్తూ ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటికే తొలి టీ20 నెగ్గిన ఆసిస్ తాజాగా వరుసగా రెండో మ్యాచ్‌ను కూడా నెగ్గింది. శుక్రవారం అక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసిస్ 72 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. 175 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్పిన్‌లో చిక్కుకుని 102 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను కంగారుల జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో దక్కించుకుంది. ఇక, ఆదివారం జరిగే చివరి టీ20 నామమాత్రమే కానుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 19.5 ఓవర్లలో 174 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(45) రాణించగా.. కమిన్స్(28), మిచెల్ మార్ష్(26) విలువైన పరుగులు జోడించారు. మిగతా వారు ప్రభావం చూపలేకపోయారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మిల్నే, బెన్ సియర్స్, సాంట్నర్ రెండేసి వికెట్లతో సమిష్టిగా రాణించారు. అనంతరం 175 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఆసిస్ బౌలర్లు కాపాడుకున్నారు. ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ను 17 ఓవర్లలో 102 పరుగులకే కూల్చేశారు. గ్లెన్ ఫిలిప్స్(42) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్పిన్నర్ ఆడమ్ జంపా స్పిన్ మంత్రంతో కివీస్ మిడిలార్డర్‌ను కట్టడి చేయడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. 4 వికెట్లతో జంపా ఆసిస్ విజయంలో కీలక పాత్ర పోషించగా.. నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీసుకున్నారు.