తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచిన వరల్డ్ కప్ హీరో

by GSrikanth |
తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచిన వరల్డ్ కప్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీతో చెలరేగాడు. 340 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్స్‌తో డబుల్ సెంచరీ చేశాడు. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ కూడా సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా 118 పరుగులు చేసి పెవీలియన్ చేరాడు.

కాగా, గతేడాది వరల్డ్ కప్‌లో అద్భుతమైన ప్రతిభ కనభర్చిన రచిన్ రవీంద్ర అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టెస్టుల్లో చేసిన తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచి జట్టును తాను ఎంత విలువైన ఆటగాడో మరోసారి ప్రూవ్ చేశాడు. అంతేకాడు.. న్యూజిలాండ్ తరపున డబుల్ సెంచరీ చేసిన రెండో అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. కివీస్‌ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (20), డెవాన్‌ కాన్వే (1)లను వెంటనే పెవీలియన్‌కు పంపగలిగిన సౌతాఫ్రికాకు కేన్ మామ, రచిన్ రవీంద్రను అడ్డుకోలేకపోయారు. ప్రస్తుతం సౌతాఫ్రికా ఎదుట 500 పరుగుల లక్ష్యం పెట్టారు.

Advertisement

Next Story