Paris Olympics : అందరి చూపు నీరజ్‌పైనే.. మళ్లీ పతకం తెస్తాడా?.. నేడే క్వాలిఫికేషన్ రౌండ్

by Harish |
Paris Olympics : అందరి చూపు నీరజ్‌పైనే.. మళ్లీ పతకం తెస్తాడా?.. నేడే క్వాలిఫికేషన్ రౌండ్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమై సోమవారంతో 10 రోజులు పూర్తయ్యాయి. ఈ 10 రోజుల్లో భారత అభిమానులు మిగతా ఈవెంట్లను ఎంజాయ్ చేసినా.. ఒక్కడి కోసం ఎదురుచూశారు. అతనే జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. నీరజ్ ఆగమనానికి సమయం ఆసన్నమైంది. నేడు జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ జరగనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించిన నీరజ్ ఈ సారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. మళ్లీ స్వర్ణం కొల్లగొట్టాలనే దీమాతో ఉన్నాడు.

టోక్యో ఒలింపిక్స్ తర్వాత కూడా నీరజ్ నిలకడగా రాణించాడు. గాయాలు ఇబ్బంది పెట్టినా సత్తాచాటాడు. ఈ ఏడాది మూడు ఈవెంట్లలో పాల్గొన్న అతను అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మేలో దోహ డైమండ్ లీగ్‌లో 88.36 మీటర్ల త్రోతో రతజం సాధించాడు. జూన్‌లో ఫిన్లాండ్‌లో జరిగిన పావో నుర్మి గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ అదే జోరును కొనసాగిస్తాడని అందరి విశ్వాసం. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అతను గ్రూపు-బిలో ఉన్నాడు. ప్రతి గ్రూపు నుంచి 12 మంది ఫైనల్‌కు చేరుకుంటారు. నీరజ్ ఫైనల్ రౌండ్‌కు చేరుకోవడం ఖాయమే. అయితే, ఫైనల్‌లో నీరజ్‌కు జూలియన్ వెబెర్(జర్మనీ), అండర్సన్ పీటర్స్(గ్రెనడా), జాకుబ్ వడ్లజ్చ్(చెక్ రిపబ్లిక్)లతో సవాల్ ఎదుర్కొనున్నాడు. మరో భారత జావెలిన్ త్రోయర్, ఆసియా గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ కిశోర్ జెనాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అతను క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రూపు-ఏలో పోటీపడుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed