- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NCA: బెంగళూరులో కొత్త జాతీయ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన బీసీసీఐ
దిశ, వెబ్‌డెస్క్:బెంగళూరు(Bengaluru)లో అత్యాధునిక సౌకర్యాలతో బీసీసీఐ(BCCI) కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ(NCA)ని ప్రారంభించింది.బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ(Roger Binny), కార్యదర్శి జై షా(Jai sha) దీనిని అధికారంగా ప్రారంభించారు.ఈ కొత్త క్రికెట్ ఆకాడమీకి 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్'(CEO) అనే పేరు పెట్టారు.
కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రత్యేకతలు ఇవే..
దాదాపు 40ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త ఎన్‌సీఏలో మొత్తం మూడు క్రీడా మైదానాలను సిద్ధం చేశారు.వీటిలో ఇండోర్, అవుట్ డోర్ కలిపి మొత్తం 86 పిచ్‌లు ఉన్నాయి.ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో వాడే పిచ్‌లను ఇక్కడ ఉపయోగించారు. ఇందుకోసం వేర్వేరు ప్రాంతాల నుంచి మట్టిని తెప్పించారు. అలాగే మైదానంలో వర్షం పడినా నీరు త్వరగా ఇంకిపోయేందుకు సబ్ సర్ఫేస్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేశారు.అలాగే తెల్లటి పికెట్ ఫెన్సింగ్ వేశారు. ఎన్‌సీఏలో 45 అవుట్ డోర్ నెట్ ప్రాక్టీస్ పిచ్ లు ఉన్నాయి. వీటన్నింటినీ UK నుంచి తెప్పించిన సేఫ్టీ నెట్స్‌తో వేరు చేశారు. అలాగే ఆరు అవుట్ డోర్ రన్నింగ్ సింథటిక్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు.ఇవేకాకుండా ఈ కొత్త ఎన్‌సీఏలో అతిపెద్ద డ్రెస్సింగ్ రూమ్, లాంజ్, మసాజ్ రూమ్, కిట్ రూమ్, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అలాగే అత్యాధునిక సదుపాయాలతో కామెంటరీ, మ్యాచ్ రిఫరీ గదులు, విశాలమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏరియా, వీఐపీ లాంజ్, డైనింగ్ ఏరియా, పరిపాలనా భవనాలు ఉన్నాయి.ఈ కొత్త క్రికెట్ అకాడమీని కేవలం క్రికెటర్లకే కాకుండా అథ్లెటిక్స్,ఇతర క్రీడాకారులు వినియోగించుకునేలా తీర్చిదిద్దారు.