- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పారిస్ ఒలింపిక్స్ నుంచి మురళీ శ్రీశంకర్ ఔట్..!
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్ ముందు భారత్ కు షాక్ తగలింది. గాయం కారణంగా స్టార్ అథ్లెట్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్ నుంచి లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ తప్పుకున్నాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.
శిక్షణ సమయంలో తాను మోకాలి గాయంతో బాధపడినట్లు తెలిపాడు. అన్ని టెస్టులు, సంప్రదింపుల తర్వాత సర్జరీ అవసరమని తేలిందని ప్రకటించారు. ఆ గాయం వల్ల తాను ఇన్నేళ్లుగా కష్టపడ్డ కలకు దూరమైనట్లు తెలిపారు. తన పారిస్ ఒలింపిక్స్ డ్రీమ్ ముగిసిందని భావోద్వేకంగా సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
కేరళకు చెందిన 25 ఏళ్ల మురళీ శ్రీశంకర్ 2023 జూలైలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 8.37 మీటర్ల జంప్‌తో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించాడు. కానీ, దురదృష్టవశాత్తూ మోకాలి గాయం కారణంగా ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. ఇకపోతే, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి భారత పురుష లాంగ్‌జంపర్‌గా చరిత్రకెక్కాడు మురళీ శ్రీశంకర్. అమెరికా వేదికగా 2022 జులై 17న జరిగిన ఫైనల్స్‌లో శ్రీశంకర్ 7.96 మీటర్లు జంప్ తో ఏడో స్థానంతో సరిపెట్టాడు. కాగా, పారిస్ వేదికగా ఈ ఏడాది జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి.
— Sreeshankar Murali (@SreeshankarM) April 18, 2024