- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్, పాక్ మ్యాచ్ కోసం వెళ్లి.. న్యూయార్క్‌లో ఎంసీఏ ప్రెసిడెంట్ మృతి
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ప్రెసిడెంట్ అమోల్ కాలే కన్నుమూశారు. 47 ఏళ్ల అమోల్ కాలే సోమవారం న్యూయార్క్‌లో గుండెపోటుతో మరణించారు. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆయన హాజరయ్యారు. ఎంసీఏ సెక్రెటరీ అజింక్యా నాయక్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సూపర్ సమత్‌తో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. భారత్ విజయాన్ని ఆస్వాదించారు. ఆయన మృతిలో ముంబై క్రికెట్‌లో విషాదం నెలకొంది. 2022లో అమోల్ కాలే ఎంసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఎంసీఏ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రంజీ ట్రోఫీలో ముంబై జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ ఇచ్చే మ్యాచ్ ఫీజులనే ఇవ్వాలని నిర్ణయించడం, వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహం ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంది.
Advertisement
Next Story