విజయానికి ఐదు వికెట్ల దూరంలో ముంబై.. పోరాడుతున్న విదర్భ

by Swamyn |
విజయానికి ఐదు వికెట్ల దూరంలో ముంబై.. పోరాడుతున్న విదర్భ
X

దిశ, స్పోర్ట్స్: విదర్భ, ముంబై జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయిన విదర్భ.. 248 పరుగులు చేసింది. కరుణ్‌ నాయర్‌ (74) అర్ధశతకంతో మెరిశాడు. కెప్టెన్‌ అక్షయ్ వాడ్కర్ (56 నాటౌట్) బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. విజయం కోసం పోరాడుతున్న విదర్భకు ఇంకా 290 పరుగులు కావాల్సి ఉంది. ప్రస్తుతం అక్షయ్‌(56*), హర్ష్‌ దూబే (11*) క్రీజులో ఉన్నారు. మరో ఐదు వికెట్ల కోసం ముంబై బౌలర్లు చెమటోడుస్తున్నారు. చివరి రోజైన గురువారం ఫలితం తేలనుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 10/0తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన విదర్భకు ఓపెనర్లు అథర్వ తైడే (32), ధ్రువ్‌ షోరె (28) శుభారంభం అందించలేదు. స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్.. అమన్ మోఖడే(32)తో కలిసి జట్టుకు మంచి భాగస్వామ్యం అందించాడు. అక్షయ్‌ కూడా అర్ధసెంచరీతో రాణించాడు. ముంబై ఆటగాళ్లలో సెంచరీతో మెరిసిన ముషీర్‌ ఖాన్‌ బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. 20 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీయగా, తనుష్ కొటియన్‌ రెండు, శామ్స్‌ ములానీ ఒక వికెట్ పడగొట్టారు.

ముంబై తొలి ఇన్నింగ్స్‌: 224/10

విదర్భ తొలి ఇన్నింగ్స్‌: 105/10

ముంబై రెండో ఇన్నింగ్స్‌: 418/10

విదర్భ రెండో ఇన్నింగ్స్: 248/5(బ్యాటింగ్)

slug: Mumbai ahead despite Vidarbha fightback pushes final into Day 5

Advertisement

Next Story