భారత క్రికెట్ దిగ్గజాలకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం..

by Vinod kumar |
భారత క్రికెట్ దిగ్గజాలకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం..
X

లండన్: భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, మిథాలీ రాజ్, జులన్ గోస్వామి‌లకు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ రూల్స్‌ను రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) వీరికి జీవితకాల సభ్యత్వ అవార్డులను ప్రదానం చేసింది. వరల్డ్ క్రికెట్‌లో విశేష సేవలందించిన వారికి ఎంసీసీ జీవితకాల సభ్యత్వం అవార్డులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కొత్తగా లైఫ్‌టైమ్ మెంబర్‌షిప్ పొందిన 19 మంది జాబితాను ఎంసీసీ బుధవారం రిలీజ్ చేసింది.

భారత్ ‌నుంచి ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, మిథాలీ రాజ్, జులన్ గోస్వామి జీవితకాల సభ్యులుగా అవార్డులు పొందారు. అలాగే, ఈ జాబితాలో అత్యధికంగా భారత్‌తోపాటు ఇంగ్లాండ్ నుంచి ఐదుగురు మాజీ ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్‌ నుంచి ఇద్దరు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్‌ నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. అలాగే, మైదానం వెలుపుల క్రికెట్‌కు సహకారం అందించిన మరో ఇద్దరికి కూడా ఎంసీసీ లైఫ్‌టైమ్ మెంబర్‌షిప్ ఇచ్చింది. మొత్తంగా భారత్ నుంచి 37 మంది ఇప్పటివరకు ఎంసీసీ జీవితకాల సభ్యత్వం పొందారు.

Advertisement

Next Story