- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అతడు మరిన్ని సీజన్లు ఆడేంత ఫిట్‌గా ఉన్నాడు.. రోహిత్ శర్మ
దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా లెజెండ్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అన్న వార్తలు వస్తుండటంపై రోహిత్ శర్మ స్పందించాడు. ధోనీ మరో రెండు, మూడేళ్లు ఆడేంత ఫిట్‌గా ఉన్నాడని.. మరిన్ని సీజన్లు ఆడే సత్తా ధోనీకి ఉందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. గత సీజన్‌లో ధోనీ మాట్లాడుతూ.. 2023లో ఇండియాలోని ప్రతి స్టేడియంలో ఆడి ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పే అవకాశం వస్తే అంతకు మించి కావాల్సింది ఏముంటుందని ధోనీ అన్నాడు. దీంతో ఈసారి ఐపీఎల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కచ్చితంగా ధోనీ తన చివరి సీజన్ ఆడబోతున్నాడని ఫ్యాన్స్ తేల్చేస్తున్నారు.
కానీ కోచ్ మార్క్ బౌచర్‌తో కలిసి బుధవారం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. "గత రెండు, మూడు సీజన్ల నుంచి ధోనీకి ఇదే చివరి సీజన్ కాబోతోంది అన్న వార్తలు నేను వింటున్నాను. కానీ అతడు మరిన్ని సీజన్లు ఆడేంత ఫిట్‌గా ఉన్నాడని నేను భావిస్తున్నాను" అని రోహిత్ అభిప్రాయపడ్డాడు. 2008లో జరిగిన తొలి సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తోనే కొనసాగుతున్న ధోనీ.. ఇప్పటికీ ఆ టీమ్‌లో కీలకంగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో 234 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4,978 రన్స్ చేశాడు. అతని కెప్టెన్సీలో సీఎస్కే నాలుగు టైటిల్స్ కూడా గెలిచింది.