- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపిఎల్ కోసం మిస్టర్ కూల్ ప్రాక్టీస్ షురూ..! చెన్నై చేరుకున్న ధోనీ
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి షురువైంది. కీలక ఫ్రాంచైజీలు ఇప్పటికే.. తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి స్టార్ జట్లు కూడా ఫ్రాంచైజీ వార్‌లో పాలు పంచుకుంటున్నాయి. సీనియర్లు, జూనియర్లు అనే భేదం లేకుండా అందరూ ప్రాక్టీసుకు హాజరై తన సత్తాను మెరుగు పరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే టీ మిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ కూడా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనేందుకు శుక్రవారం చెన్నై అక్కడకు చేరుకున్నాడు. కూతురు జీవాతో కలిసి ఎయిర్‌పోర్టులో దిగిన ధోనీకి అపూర్వ స్వాగతం లభించింది. ఇప్పటికే వస్తున్న రిపోర్టులను బట్టి చూసుకుంటే ఇదే మిస్టర్ కూల్ ఆఖరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతోంది. గతేడాది తన రిటైర్‌మెంట్ గురించి మాట్లాడిన ధోనీ.. చెన్నై ప్రజల ముందే తన చివరి మ్యాచ్ ఆడతానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ సారి జరిగే ఐపీఎల్ స్టార్ తర్వాత ధోనీ మళ్లీ ఎల్లో జెర్సీలో కనిపించడని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.