రోహిత్ అలాంటి వ్యక్తి కాదు : ముంబైని వీడతాడన్న వార్తలపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

by Harish |
రోహిత్ అలాంటి వ్యక్తి కాదు : ముంబైని వీడతాడన్న వార్తలపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టును వీడతాడని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు జరిగే మెగా వేలంలో పాల్గొంటాడని, అదే జరిగితే హిట్‌మ్యాన్ కోసం ఫ్రాంచైజీలు ఎగబాడతాయని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. రోహిత్ లాంటి క్రికెటర్లకు డబ్బు ముఖ్యమైన విషయం కాదన్నాడు.

అలాగే, అతను ముంబై జట్టును వీడడని, వచ్చే సీజన్‌లోనూ ఆ జట్టుతోనే కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు. ‘రోహిత్‌‌ స్థానంలో ఉండి ఆలోచిస్తే.. ‘నాకు తలనొప్పి అవసరం లేదు. నేను ఇండియాకు కెప్టెన్. ముంబైకి చాలా సార్లు సారథిగా ఉన్నా. నేను కెప్టెన్‌‌ను కాకపోయినా ముంబైకి సంతోషంగా ఆడతా’ అనే చాలా మంది ఆటగాళ్లు ఆలోచిస్తారు. ఒక దశ తర్వాత కొంత మంది ప్లేయర్లకు డబ్బు ముఖ్యం కాదు.’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ఏడాది ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలు అప్పగించడం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed