ట్రైనింగ్ కోసం తెలుగమ్మాయి ఆకుల శ్రీజకు కేంద్రం ఆర్థిక సాయం

by Harish |
ట్రైనింగ్ కోసం తెలుగమ్మాయి ఆకుల శ్రీజకు కేంద్రం ఆర్థిక సాయం
X

దిశ, స్పోర్ట్స్: తెలుగమ్మాయి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజకు కేంద్రం ఆర్థికసాయం అందించనుంది. జూలై చివర్లో ప్రారంభం కానున్న ‘పారిస్ ఒలింపిక్స్’ కోసం ట్రైనింగ్ తీసుకునేందుకు ఆర్థికసాయం చేయాలంటూ పలువురు అథ్లెట్లు ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర క్రీడ, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, మిషన్ ఒలింపిక్ సెల్ తాజాగా నిర్వహించిన సమావేశంలో ఇందుకు అంగీకరించింది. కేంద్రం నిర్ణయంతో రానున్న ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు శ్రీజ తైవాన్‌లోని తైపీలో ట్రైనింగ్‌కు వెళ్లనుంది. శ్రీజతోపాటు జుడోకా ప్లేయర్ తులికా మన్, మానవ్ థక్కర్, పయాస్ జైన్‌‌లకూ విదేశాల్లో ట్రైనింగ్‌ తీసుకునేందుకు ఆర్థికసాయం ప్రకటించింది. స్టార్ రెజ్లర్ బజరంగ్‌ పునియాకూ ప్రాక్టీస్ కోసం ఆర్థికంగా మద్దతివ్వనున్నట్టు వెల్లడించింది.

Advertisement

Next Story