WPL 2025 : గుజరాత్ జెయింట్స్‌కు మిథాలీ గుడ్ బై?

by Sathputhe Rajesh |
WPL 2025 : గుజరాత్ జెయింట్స్‌కు మిథాలీ గుడ్ బై?
X

దిశ, స్పోర్ట్స్ : గుజరాత్ జెయింట్స్‌కు భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ గుడ్ బై చెప్పనున్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. డబ్ల్యూపీఎల్-2025 వేలం ఈ నెల 15 నుంచి బెంగళూరులో ప్రారంభం కాకముందే మిథాలీ గుజరాత్ జట్టు నుంచి దూరం కానున్నట్లు తెలుస్తోంది. మిథాలీ రాజ్‌ను గుజరాత్ జెయింట్స్ మూడేళ్ల పాటు తమ మెంటర్, అడ్వైజర్‌గా గతేడాది నియమించింది. వరుసగా రెండు సీజన్లలో జట్టు లీగ్‌లో చివరి స్థానంలో నిలిచింది. దీంతో గుజరాత్ జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మిథాలీరాజ్ ఇటీవల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు మెంటర్‌గా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. జెయింట్స్ జట్టు బౌలింగ్ కోచ్ నుషిన్ అల్ ఖదీర్‌ను సైతం రిలీజ్ చేసింది. నుషిన్ భారత మహిళల అండర్-19 ప్రస్తుత కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. రచెల్ హైన్స్ స్థానంలో మైకెల్ క్లింగర్‌ను గుజరాత్ హెడ్ కోచ్‌గా నియమించనున్నట్లు తెలిసింది. ఫీల్డింగ్ కోచ్‌గా కార్ల్ హప్కిన్‌సన్‌నే జట్టు కొనసాగించనున్నట్లు సమాచారం. గుజరాత్ ఫ్రాంచైజీ ఈ మార్పులన్నింటిపై నేడు(గురువారం) ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed