క్యాన్సర్‌ను జయించిన అమెరికా టెన్నిస్ ప్లేయర్..

by Vinod kumar |   ( Updated:2023-03-23 15:36:47.0  )
క్యాన్సర్‌ను జయించిన అమెరికా టెన్నిస్ ప్లేయర్..
X

న్యూఢిల్లీ : అమెరికా దిగ్జజ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా క్యాన్సర్‌ని జయించింది. 66 ఏళ్ల నవ్రతిలోవా మూడు నెలల క్రితం గొంతు, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. అప్పటి నుంచి క్యాన్సర్‌తో పోరాడిన ఆమె ఎట్టకేలకు మహమ్మారి నుంచి బయటపడింది. ఈ విషయాన్ని నవ్రతిలోవా స్వయంగా వెల్లడించింది. ‘క్యాన్సర్ నుంచి ఇంత త్వరగా కోలుకుంటానని అనుకోలేదు. చికిత్స సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. అన్నీ భరించి క్యానర్ నుంచి విముక్తి పొందాను’ అని ఆమె తెలిపింది. ప్రస్తుతం వియామీ ఓపెన్‌లో టీవీ చానల్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. కరోనా నుంచి కోలుకుని విధుల్లో చేరారు. నవ్రతిలోవా తన కెరీర్‌లో 18 సింగిల్స్ టైటిల్స్‌తోపాటు 31 మహిళ డబుల్స్, 10 మిక్స్‌డ్ డబుల్స్‌తో మొత్తంగా 59 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ గెలుచుకుంది.

Also Read...

ఫ్యామిలీ ప్యాకేజీ.. ఒకేసారి గర్భం దాల్చిన అత్త, కోడలు, అమ్మ, అమ్మమ్మ (వీడియో)

Advertisement

Next Story