ఫీల్డింగ్‌లో అదరగొట్టిన మార్క్‌రామ్.. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్ నమోదు (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-02-07 11:13:55.0  )
ఫీల్డింగ్‌లో అదరగొట్టిన మార్క్‌రామ్.. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్ నమోదు (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ-20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ విజయాల జోరును కంటిన్యూ చేస్తోంది. టోర్నీలోకి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. నిన్న జరిగిన తొలి నాకౌట్ మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 51 పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్ కల్లుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. డర్బన్ సూపర్ జెయింట్స్‌ బ్యాట్స్‌మెన్ జేజే స్మట్స్ లాంగ్ ఆన్ మీదుగా కొట్టిన బంతిని మార్క్‌రామ్ గాలిలో ఎగురుతూ..ఒంటి చేతులతో ఒడిసిపట్టాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. క్యాచ్ చూసిన నెటిజన్లు ‘ఆహా.. ఏమా క్యాచ్ అంటూ’ మార్క్‌రామ్ కొనియాడుతున్నారు. కాగా, మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. డర్బన్ బౌలర్లు మధ్యలో వికెట్లు తీసినా.. కెప్టెన్ మార్క్‌రమ్‌తో కలిసి మలన్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగారు. అనంతరం చేజింగ్‌కు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ సన్ రైజర్స్ పేసర్ల ధాటికి విలవిలలాడారు. ఈ క్రమంలో 19.3 ఓవర్లలో 106 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది.

Advertisement

Next Story