- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏషియన్ మారథాన్ చాంపియన్‌గా మాన్‌సింగ్
దిశ, స్పోర్ట్స్ : భారత అథ్లెట్ మాన్ సింగ్ ఏషియన్ మారథాన్ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం హాంకాంగ్‌లో జరిగిన ఏషియన్ మారథాన్ చాంపియన్‌షిప్‌లో మాన్ సింగ్ స్వర్ణం గెలిచాడు. 2 గంటల 14 నిమిషాల 19 సెకన్లలో అతను లక్ష్యాన్ని చేరుకున్నాడు. గతేడాది ముంబై మారథాన్‌లో 2:12:00 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోగా.. ఏషియన్ చాంపియన్‌షిప్‌లో దాన్ని అధిగమించి పర్సనల్ బెస్ట్ నమోదు చేశాడు. అంతేకాకుండా, ఏషియన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత మారథానర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2017లో గోపి తోనక్(2:15:48 సెకన్లు) విజేతగా నిలిచాడు. చైనా అథ్లెట్ హువాంగ్ యోంగ్‌జెంగ్(2:15:24 సెకన్లు) రజతం, కిర్గిజ్‌స్తాన్ అథ్లెట్ టియాప్కిన్ ఇలియా(2:18:18 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నారు. మరో భారత అథ్లెట్ బెల్లియప్ప(2:20:20 సెకన్లు) ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో భారత అథ్లెట్లు అశ్విని మదన్ జాదవ్(2:56:42 సెకన్లు) 8వ స్థానంతో సరిపెట్టగా.. జ్యోతి(3:06:20 సెకన్లు) 11వ స్థానంలో నిలిచింది.