ICC Champions Trophy 2024 : భారత్-పాక్ మ్యాచ్ లేకుంటే లీగల్ యాక్షన్స్

by Sathputhe Rajesh |
ICC Champions Trophy 2024 : భారత్-పాక్ మ్యాచ్ లేకుంటే లీగల్ యాక్షన్స్
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ఐసీసీకి తలనొప్పిగా మారింది. భద్రతా కారణాలతో పాకిస్తాన్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ తన స్టాండ్‌ను ఇప్పటికే క్లియర్‌గా ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లేకుంటే లీగల్ యాక్షన్స్ తీసుకోవాలని బ్రాడ్ క్యాస్టర్లు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమర్షియల్ పార్ట్‌నర్లు, బ్రాడ్ క్యాస్టర్లు ఐసీసీ ట్రోఫీ షెడ్యూల్‌లో ఖచ్చితంగా భారత్-పాక్ మ్యాచ్ ఉండాల్సిందే అని పట్టుబట్టినట్లు తెలిసింది. హైబ్రిడ్ మోడల్‌(తటస్థ వేదికల్లో మ్యాచ్‌ల నిర్వహణ)ను అంగీకరించాలని ఇప్పటికే ఐసీసీ ఉన్నతాధికారులు పీసీబీతో సంప్రదింపులు జరిపారు. లేని పక్షంలో భారీ ఆర్థిక చిక్కులు తప్పవని స్పష్టం చేశారు. ఒక వేళ భారత్ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనకపోతే ఈ టోర్నీ లాస్ వెంచర్‌గా నిలుస్తుందని అధికారులు పీసీబీకి చెప్పారు. ఐసీసీ మాత్రం ఎలాగైనా షెడ్యూలును త్వరగా విడుదల చేయాలని చూస్తోంది.

Advertisement

Next Story